16, నవంబర్ 2010, మంగళవారం

వైదిక విజ్ఞాన శాస్త్రము - 1

వైదిక విజ్ఞాన శాస్త్రము అతి ప్రాచీనమైనది.  ఋషులు, గురువులు, సన్యాసుల ఆధ్యాత్మిక చింతన ద్వారా ఈ శాస్త్రాలు వెలుగులోకి వచ్చి సృష్టి, కాల ధర్మాలను తెలిపే అత్యద్భుతమైన శాస్త్రములుగా పేరు ప్రఖ్యాతులను బడసినవి.   వైదిక విజ్ఞాన శాస్త్రాలు అన్ని కూడా జీవుడి యొక్క మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి.  వైదిక విజ్ఞాన శాస్త్రాలలో ముఖ్యముగా 6 శాస్త్రాలు పేరెన్నిక కలిగి జీవుడికి ఆధ్యాత్మిక సంబంధాన్ని, కాల స్వరూపాన్ని, భగవంతుడి సర్వోత్తమత్వాన్ని తెలుపడం లో ప్రసిద్ధి గాంచినవి.

     ౧. అధిభూత విజ్ఞానము                                               ౨. ఆధ్యాత్మ విజ్ఞానము
     ౩. అధిదైవ విజ్ఞానము                                                  ౪. అది యజ్ఞ విజ్ఞానము
     ౫. బ్రహ్మ విజ్ఞానము                                                    ౬. కర్మ విజ్ఞానము